కరోనా కారణంగా అమెరికాలో లక్ష మంది చనిపోతారనిపిస్తోంది: ట్రంప్
- అమెరికాలో కరోనా విలయతాండవం
- 67 వేలకు పైగా మరణాలు
- తలుచుకుంటేనే భయం కలుగుతోందన్న ట్రంప్
అమెరికాలో కరోనా ఏ స్థాయిలో బీభత్సం సృష్టిస్తోందో తెలిసిందే. 11 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 67 వేలకు పైగా మరణాలతో ఈ అగ్రరాజ్యం అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో దేశంలో తాజా పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనాతో లక్ష మంది వరకు చనిపోతారని భావిస్తున్నట్టు తెలిపారు.
"ఈ కరోనా మహమ్మారి కారణంగా మేం 75 వేల నుంచి 1 లక్ష మంది వరకు పౌరులను కోల్పోతామనిపిస్తోంది. తలుచుకుంటేనే భయమేస్తోంది" అని వ్యాఖ్యానించారు. కొన్నిరోజుల కిందట ఆయన అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 70 వేల వరకు చేరుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కరోనా ఇప్పటికీ స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలు మార్చుకున్నట్టు తెలుస్తోంది.