అండమాన్ వద్ద అల్పపీడనం... కోస్తా జిల్లాలకు వర్ష సూచన

అండమాన్ వద్ద అల్పపీడనం... కోస్తా జిల్లాలకు వర్ష సూచన
  • మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం
  • బుధవారం వరకు ఉత్తరకోస్తాలో ఓ మోస్తరు వర్షాలు
  • కృష్ణా, గుంటూరు, దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అదే సమయంలో మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతం నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.

 దీని ప్రభావంతో నేటి నుంచి బుధవారం వరకు ఉత్తరకోస్తాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, బుధవారం నుంచి రాయలసీమలోనూ జల్లులు పడతాయని తెలిపింది.

కాగా, అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారి ఏపీ దిశగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల రెండో వారం నాటికి తుపాను ఏపీ తీరం సమీపానికి రావొచ్చని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ తుపానుకు 'ఎంఫాన్' అని నామకరణం చేశారు.


More Telugu News