విశాఖలోని 15 కంటైన్ మెంట్ జోన్లకు ఎలాంటి సడలింపులు లేవు: మంత్రి అవంతి శ్రీనివాస్
- కేంద్రం సూచనల మేరకు మరో 2 వారాల పాటు ఆంక్షలు
- కంటైన్ మెంట్ జోన్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
- మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు చేశాం
విశాఖపట్టణం జిల్లాలో 15 కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం సూచనల మేరకు మరో రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు. కంటైన్ మెంట్ జోన్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.
కంటైన్ మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు చేసినట్టు చెప్పారు. కంటైన్ మెంట్ కాని జోన్లలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపులు ఉన్నాయని వివరించారు. మండల స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆంక్షల మినహాయింపులపై అక్కడికక్కడే నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టామని అన్నారు.