కేశినేని నానిపై కేసు పెట్టడం సరైనదే: మంత్రి వెల్లంపల్లి
- మసీదులు, చర్చిలు, ఆలయాలను పగలగొట్టిన చరిత్ర కేశినేనిది
- విజయవాడకు ఆయన చేసిందేమీ లేదు
- సొంత ట్రావెల్స్ ఉద్యోగులనే మోసం చేశారు
టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ విజయవాడకు పట్టిన చీడపురుగులని వ్యాఖ్యానించారు. ఎంపీగా విజయవాడకు కేశినేని నాని చేసిందేమీ లేదని అన్నారు. కరోనా వైరస్ వచ్చిన 45 రోజుల తర్వాత ప్రజలకు సాయం చేయాలని నానికి అనిపించిందా? అని ప్రశ్నించారు.
పుష్కరాల సమయంలో మసీదులు, ఆలయాలు, చర్చిలను పగలగొట్టిన నాని ప్రజాద్రోహి అని అన్నారు. సొంత ట్రావెల్స్ ఉద్యోగులను మోసం చేసిన చరిత్ర ఆయనదని విమర్శించారు. కరోనా సాయం పేరిట మంత్రి రూ. 10 కోట్లు వసూలు చేశారంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ మేరకు దుయ్యబట్టారు.
ఇదే సమయంలో బోండా ఉమ గురించి మాట్లాడుతూ... తాగి వచ్చి, మద్యం సీసాలతో ప్రెస్ మీట్ పెడతారని మండిపడ్డారు. వ్యాపారులకు బోండా ఉమ వ్యతిరేకి అని విమర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి సాయం ముసుగులో టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని... ఇందంతా చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతోందని ఆరోపించారు.