ఇతర వస్తువుల అమ్మకాలు షురూ చేసిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్

  • మూడో విడత లాక్ డౌన్ లో సడలింపులు
  • ఈ-కామర్స్ సైట్లపై పాక్షికంగా తొలగిన ఆంక్షలు
  • పరిమితంగానే సేవలు!
కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్ డౌన్ కొనసాగిస్తుండడంతో ఇన్నాళ్లు నిత్యావసర వస్తువుల అమ్మకాలకే పరిమితమైన ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నేటి నుంచి ఇతర వస్తువుల విక్రయాలను కూడా షురూ చేశాయి. మూడో విడత లాక్ డౌన్ సందర్భంగా కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడంతో, ఈ-కామర్స్ విక్రయాలపై ఆంక్షలు సడలిపోయాయి.

 కరోనా కేసులు లేని, కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విక్రయాలు సాగించుకోవచ్చంటూ కేంద్రం స్పష్టం చేసిన దరిమిలా, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు పునఃప్రారంభం అయ్యాయి. అయితే, ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొన్నిరకాల వస్తువులనే అందించగలమంటూ అమెజాన్ పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.


More Telugu News