ఢిల్లీ లాంటి చోట ‘కరోనా’ కట్టడికి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

  • ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వకుంటే బాగుంటుంది
  • రాష్ట్రాల్లో సడలింపులపై అక్కడి ప్రభుత్వాలే తేల్చుకోవాలి
  • ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకోవాలి
ఢిల్లీ లాంటి చోట కరోనా వైరస్ కట్టడికి ఇంకా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో లాక్ డౌన్-3 సడలింపులు ఇవ్వకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

సడలింపులకు సంబంధించి కేంద్ర హోం శాఖ, వైద్య శాఖలు చాలా వివరంగా మార్గదర్శకాలు జారీ చేశాయని అన్నారు. ‘కరోనా’ కట్టడికి చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రాల్లో ఏ మేరకు సడలింపులు ఇవ్వాలనే దానిపై ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల మేరకు అక్కడి ప్రభుత్వాలే తేల్చుకోవాలని సూచించారు.


More Telugu News