ముఖ్యమంత్రి గారు.. మందుబాబులను కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద పనిగా మారింది: వర్ల
- పోలీసులు ఇప్పటికే సతమతమవుతున్నారు
- మీ అనాలోచిత నిర్ణయం వల్ల పోలీసులకు ఇబ్బందులు పెరిగాయి
- గ్రీన్ జోన్లో తాగి రెడ్ జోన్లో గొడవలు చేయకుండా కంట్రోల్ చేయడం పెద్ద పని
లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజుల తర్వాత ఏపీలో వైన్ షాపులు మళ్లీ తెరుచుకున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సమయంలో వైన్ షాపులను ప్రారంభించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే పోలీసులు సతమతమవుతున్నారని... మీ అనాలోచిత నిర్ణయం వల్ల వైన్ షాపుల దగ్గర మందుబాబులను కంట్రోల్ చేయడం పెద్ద పనిగా మారిందని విమర్శించారు. గ్రీన్ జోన్ లో తాగిన వారు రెడ్ జోన్ లో ప్రవేశించి ఆగడాలు చేయకుండా కంట్రోల్ చేయడం పోలీసులకు మరో పెద్ద పని అని చెప్పారు. కరోనా నియంత్రణను గాలికి వదిలేయకండి సార్ అంటూ ట్వీట్ చేశారు.