అమెరికా కంపెనీ సిల్వర్‌ లేక్‌తో జియో మరో భారీ డీల్!

  • ఇటీవలే జియోలో పెట్టుబడులు పెట్టిన ఫేస్‌బుక్
  • జియోలో సిల్వర్ లేక్ రూ.5,655.75 కోట్ల పెట్టుబడులు
  • ప్రకటించిన ఆర్ఐఎల్, జియో
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో ఇటీవల భారీ డీల్ కుదుర్చుకున్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో, తాజాగా మరో భారీ డీల్‌‌కు సిద్ధమైంది. అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్, జియోలో రూ. 5,655.75 కోట్లతో 1.15 శాతం వాటాను సొంతం చేసుకోవాలని నిర్ణయించింది. దీని ఈక్విటీ విలువ రూ.4.90 లక్షల కోట్లు. 5.7 బిలియన్ డాలర్లను జియోలో పెట్టుబడి పెట్టనున్నట్టు ఫేస్‌బుక్ రెండు వారాల క్రితం ప్రకటించింది. అంతలోనే జియో మరో భారీ డీల్‌కు రెడీ కావడం గమనార్హం.  

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఈ రోజు ఓ ప్రకటన చేశాయి. జియో ప్లాట్‌ఫ్లామ్స్‌లలో సిల్వర్ లేక్ రూ. 5,655.75 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు అందులో పేర్కొన్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లలో పెట్టే ఈ పెట్టుబడి ఈక్విటీ విలువ రూ. 4.90 లక్షల కోట్లు కాగా, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.5.15 లక్షల కోట్లని ఆర్ఐఎల్, జియో ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.


More Telugu News