కరోనాపై పనిచేస్తున్న బయోకాన్ మందు.. ఒక్క డోస్ రూ. 60 వేలు!
- 'ఇటోలీజుమ్యాబ్'ను మార్కెటింగ్ చేస్తున్న బయోకాన్
- వెంటిలేటర్ పై ఉన్న రోగి సాధారణ స్థితికి
- ప్రయోగాలకు ఔషధాన్ని ఉచితంగా ఇస్తామన్న కిరణ్ మజుందార్
కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగుల్లో 'ఇటోలీజుమ్యాబ్' ఔషధం బాగా పనిచేస్తోందని ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న నాయిర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉన్న ఇద్దరు రోగులకు దీన్ని అందించగా, వారి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరిందని స్పష్టం చేశారు.
కాగా, 'ఇటోలీజుమ్యాబ్'ను ఇండియాలో బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. సోరియాసిస్, ఆర్థ్ రైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ ఔషధాన్ని వాడుతుంటారు. ఒక డోస్ ఇంజక్షన్ ఖరీదు రూ. 60 వేలు. కరోనాపై తమ ఔషధం సత్ఫలితాలను ఇస్తోందని తెలుసుకున్న బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా వాడేందుకు 'ఇటోలీజుమ్యాబ్'ను ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు.
నాయిర్ ఆసుపత్రిలో ఈ డ్రగ్ పనిచేసిందని వైద్యులు వెల్లడించిన తరువాత, కింగ్ ఎడ్వర్డ్ స్మారక ఆసుపత్రిలో 35 ఏళ్ల కరోనా పాజిటివ్ రోగికి ఔషధాన్ని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇక వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 125 మంది పేద రోగులకు కూడా 'ఇటోలీజుమ్యాబ్' ఇవ్వాలని భావిస్తున్న బీఎంసీ అధికారులు, ఆ మేరకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.