ఏపీలో తెరుచుకుంటున్న మద్యం షాపులు.. ధరలు 25 శాతం పెంపు!

  • ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు
  • ధరల పెంపు ద్వారా ఖజానాకు రూ.4,400 కోట్ల అదనపు ఆదాయం
  • బార్లు, క్లబ్బులు మరికొంత కాలం ఆగాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. అయితే, మందుబాబులకు షాకిచ్చేలా మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో మద్యం ధరలను 25 శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఖజానాకు అదనంగా రూ.4,400 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకోనుండగా, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. దుకాణాల వద్ద రద్దీ లేకుండా,  వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు, బార్లు, క్లబ్బులు, ఏపీటీడీసీ లిక్కర్ లైసెన్స్‌తో నడిచే కేంద్రాలను తెరిచేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. మద్యం విక్రయాలపై అదనపు సర్‌చార్జీ విధిస్తున్నామని, ఫలితంగా మద్యం ధరలు పెరుగుతాయని అన్నారు.


More Telugu News