చైనాను వీడనంటున్న కరోనా మహమ్మారి... కొత్తగా 14 కేసులు
- చైనాలో కొత్తగా 14 కేసులు
- వాటిలో 12 కేసుల్లో లక్షణాలు లేకుండానే పాజిటివ్
- ఈ తరహా కేసుల సంఖ్య 968
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి చైనాను ఇప్పట్లో వీడేట్టు కనిపించడంలేదు. తాజాగా అక్కడ 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారిలో 12 మందిలో ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకుండానే కరోనా పాజిటివ్ గా తేలింది.
ఇలాంటి కేసుల కారణంగా కరోనా వ్యాప్తి మళ్లీ పూర్వస్థాయికి చేరుతుందన్న ఆందోళన చైనా యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. ఈ తరహా కేసుల సంఖ్య 968గా ఉంది. ప్రస్తుతం చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,877 కాగా, 4,633 మంది మరణించారు. ఇక, దేశీయంగా కరోనా సంక్రమణం తగ్గిపోగా, విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల కనిపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 451 మంది చైనీయులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.