రెండు స్నాక్స్ ప్యాకెట్ల కోసం రూ.2.25 లక్షలు సమర్పించుకున్న బిజినెస్ మేన్!
- లాక్ డౌన్ నేపథ్యంలో సైబర్ మోసం
- మోసగాళ్లను నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు అందించిన వ్యాపారి
- అందినకాడికి ఊడ్చిన సైబర్ నేరగాళ్లు
కరోనా లాక్ డౌన్ సందట్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్లో నకిలీ హెల్ప్ లైన్ నంబర్లు ఉంచి, తద్వారా అమాయకులకు కుచ్చు టోపీ పెడుతున్నారు. ముంబయిలో ఓ బిజినెస్ మేన్ మోసగాళ్లను నమ్మి లక్షలు సమర్పించుకున్నాడు. ఆన్ లైన్ ద్వారా నిత్యావసరాలు ఆర్డర్ చేయొచ్చన్న ఓ ప్రకటన చూసి హెల్ప్ లైన్ కోసం ఇంటర్నెట్లో వెతికాడు. అప్పటికే సైబర్ నేరగాళ్లు ఉంచిన ఓ నకిలీ నంబర్ చూడడం అతడి దురదృష్టం అని చెప్పాలి. ఆ నెంబర్ కు ఫోన్ చేసి రెండు స్నాక్స్ ప్యాకెట్లు ఆర్డర్ చేశాడు. వాటి ఖరీదు రూ.400.
అయితే, ఆ రెండు ప్యాకెట్లు ఎంతకీ డెలివరీ కాకపోవడంతో మళ్లీ అదే నంబర్ కు ఫోన్ చేయగా, కాచుకుని ఉన్న మోసగాళ్లు ఎంతో తెలివి అతడి నుంచి బ్యాంకు అకౌంట్ వివరాలు రాబట్టారు. అతడి ఫోన్ కు ఓ లింకును పంపి తమ పని పూర్తిచేశారు. వాళ్లను నమ్మిన ఆ బిజినెస్ మేన్ కు కాసేపట్లోనే తానెంత మోసపోయిందీ అర్థమైంది. అతని బ్యాంకు అకౌంట్ నుంచి ఒక్కసారిగా రూ.2.25 లక్షలు గల్లంతయ్యాయి. దాంతో లబోదిబోమన్న వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.