ఇవాళ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.. మీడియా మిత్రులకు అభినందనలు: చంద్రబాబునాయుడు

  • వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమిస్తున్నారు
  • పాలకుల వేధింపులను తట్టుకుంటున్నారు
  • మీడియా మిత్రుల కృషి నిరుపమానం
ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, మీడియా మిత్రులందరికి అభినందనలు తెలుపుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించి, పాలకుల వేధింపులను తట్టుకుని, నిష్ఫాక్షికంగా వార్తలను అందిస్తూ ప్రజా చైతన్యం కోసం మీడియా మిత్రులు చేస్తున్న కృషి నిరుపమానమైందని కొనియాడారు.

సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో, అణగారిన వర్గాల హక్కుల సాధనలో కీలక భూమిక మీడియాదేనని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారని, ‘కరోనా’పై పోరాటంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా మీడియా మిత్రులు ఉన్నారని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం ‘మీడియా’ అని, పత్రికా స్వేచ్ఛకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా ముందుండి పోరాడిందని ప్రశంసిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.


More Telugu News