రోదసి నుంచి శక్తిమంతమైన రేడియో తరంగాలు... ఏలియన్స్ కావొచ్చంటున్న శాస్త్రజ్ఞులు!

  • 30 వేల కాంతిసంవత్సరాల దూరంలోని మృత నక్షత్రం నుంచి సంకేతాలు
  • రెండు విడతలుగా ప్రసారం
  • ఏలియన్స్ ఉనికిపై పెరిగిన అంచనాలు
ఏలియన్స్ ఉన్నారనడానికి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, శాస్త్రజ్ఞులు, ఔత్సాహికుల్లో మాత్రం ఆసక్తి తొలగిపోలేదు. తాజాగా నక్షత్రమండలం నుంచి అత్యంత శక్తిమంతమైన రేడియో తరంగాలు వెలువడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ స్థాయిలో రేడియో తరంగాల విస్ఫోటనం మునుపెన్నడూ జరగలేదని భావిస్తున్నారు. ఇది జరిగింది కూడా ఏప్రిల్ 28నే.

భూమి నుంచి 30 వేల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఓ మృత నక్షత్రం వైపు నుంచి ఈ సిగ్నల్స్ వస్తున్నట్టు స్విఫ్ట్ బరస్ట్ అలెర్ట్ టెలిస్కోప్, ఎజైల్ శాటిలైట్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కూడా పసిగట్టాయి. ఈ రేడియో తరంగాలు 5 మిల్లీ సెకన్ల వ్యవధిలో రెండు విడతలుగా ప్రసారం అయినట్టు గుర్తించిన శాస్త్రవేత్తలకు, ఆ తరంగాలు ఓ నక్షత్రం రూపురేఖలు కూడా మార్చగలవని అర్థమైంది.

దాంతో, ఏలియన్స్ ఉండొచ్చన్న వాదనలకు బలం చేకూరినట్టయింది. రోదసిలో సుదూరం నుంచి వస్తున్న రేడియో తరంగాలు ఓ మృత నక్షత్రం నుంచి వచ్చేందుకు అవకాశాలు తక్కువని, గ్రహాంతర జీవుల ఉనికిని కొట్టిపారేయలేమని పరిశోధకులు అంటున్నారు.


More Telugu News