కర్ణాటకలో వలస కార్మికులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

  • రాష్ట్రంలోని వలస కార్మికుల కోసం కేఎస్ఆర్టీసీ నిర్ణయం
  • ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ప్రయాణించవచ్చు
  • ఈ ఖర్చును తాము భరిస్తామన్న కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం
లాక్ డౌన్ పొడిగింపుతో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారిని తమ స్వగ్రామాలకు  చేర్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి నిమిత్తం ఉత్తర కర్ణాటక నుంచి బెంగళూరుకు వచ్చిన వలస కార్మికులు, దినసరి కూలీలను కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వారి స్వస్థలాలకు తరలించాలని నిర్ణయించింది.

బెంగళూరులోని పలు బస్టాండ్లు వలస కార్మికులతో కిటకిటలాడిపోతున్నాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వలస కార్మికులు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఈ ఖర్చును తాము భరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ఇదిలా ఉండగా, వలస కార్మికులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నష్టాలను కొంతలో కొంత భర్తీ చేసుకోవాలని కేఎస్ఆర్టీసీ మొదట్లో భావించింది. అందుకని, భారీ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంది. దీనిపై వలస కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ తో ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే భారీ ఛార్జీలు వసూలు చేస్తారా? అని వారు ప్రశ్నించడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.


More Telugu News