నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అదనపు పీఎస్ ను విచారించిన సీఐడీ
- కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ విషయమై విచారణ
- ఆ లేఖ ఆధారాలు లేకుండా పోవడంపై ఆరా
- హైదరాబాద్ లోని ఏపీ సీఐడి కార్యాలయంలో సాంబమూర్తి విచారణ
ఏపీ మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో కేంద్ర హోం శాఖ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేశారు. ఈ విషయమై విచారణ నిమిత్తం నిమ్మగడ్డ అదనపు పీఎస్ గా పని చేసిన సాంబమూర్తిని సీఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఏపీ సీఐడీ కార్యాలయంలో సాంబమూర్తిని విచారిస్తున్నారు. కాగా,సీఐడీ ఏడీజీ వీపీ సునీల్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంబమూర్తిని కొన్ని రోజుల క్రితం విచారించింది. సాంబమూర్తి నుంచి మరికొన్ని వివరాలు రాబట్టే నిమిత్తం ఇవాళ కూడా విచారించింది.