దాంతో నాకు గుడ్లపై విరక్తి వచ్చింది.. ఏడాది పాటు వాటిని ముట్టుకోలేదు: కమల హాసన్
- అభయ్ సినిమాలో నా పాత్ర కోసం కండలు పెంచాను
- మాంసాహారం బాగా తీసుకున్నాను
- చికెన్ బాగా తినేవాడిని
- రోజుకి 32 గుడ్లు తినేవాడిని
సినీనటుడు కమలహాసన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా ఆయన సినీనటుడు విజయ్ సేతుపతితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడారు. తాను తినే ఆహారం విషయంలో తనను తాను నియంత్రించుకోలేనని చెప్పారు. తాను ఎలా తింటాననే విషయాన్ని తనకంటే తనతో బాగా సన్నిహితంగా ఉండేవారే బాగా వివరిస్తారని ఆయన చెప్పారు.
గతంలో ఒకసారి తాను తినే తిండి చూసి నటుడు శివాజీ విస్మయానికి గురయ్యారని కమల్ తెలిపారు. గతంలో తాను రోజుకు 14 కిలో మీటర్లు పరిగెత్తేవాడిని, అయితే, తనకు ప్రమాదం జరిగిన తర్వాతి నుంచి తాను అంత దూరం పరిగెత్తలేకపోతున్నానని చెప్పారు.
అభయ్ సినిమాలో తన పాత్ర కోసం కండలు పెంచడానికి చేసిన కసరత్తు గురించి ఆయన వివరించి చెప్పారు. ఆ చిత్రంలో తాను సన్నగా కనిపించాలని మొదట అనుకున్నానని తెలిపారు. అయితే, కొందరికి అలాంటి శరీరాకృతి నచ్చలేదని తెలిపారు.
దీంతో ఆ పాత్ర కోసం తాను మాంసాహారం బాగా తీసుకున్నానని చెప్పారు. రోజుకు 32 గుడ్లు తినేవాడినని, అలాగే, చికెన్ బాగా తినేవాడినని తెలిపారు. అన్ని గుడ్లు తినే సరికి ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తనకు గుడ్లపై విరక్తి వచ్చేసిందని కమల్ తెలిపారు. దీంతో మరో ఏడాది పాటు గుడ్లను తినలేదని వివరించారు.