సీఎం జగన్ మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారు: కళా వెంకట్రావు

  • రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా?
  • విపత్కర పరిస్థితిలో మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏముంది
  • ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • వాలంటీర్లు నాటు సారా తయారు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగోలేవని విమర్శించారు. ప్రపంచమంతా కరోనా నివారణ కోసం మందు తయారు చేసే పనిలో ఉందని, ఏపీ సీఎం జగన్‌ మాత్రం తన కమిషన్‌ కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా? అని కళా వెంకట్రావు మండిపడ్డారు. విపత్కర పరిస్థితిలో మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలోని ఆర్థిక ఇబ్బందుల్లో రైతులు వున్న ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వారిని ఆదుకునే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం చేయట్లేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు నాటు సారా తయారు చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. మద్యం దుకాణాలకు బదులు అన్న క్యాంటీన్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకు? అని ఆయన నిలదీశారు. వెంటనే రాష్ట్రంలోని పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News