ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిన కరోనా కేసులు.. అమెరికాలో 66 వేలకు పైగా మృతులు
- ప్రపంచంలో ఇప్పటివరకు 34,24,254 మందికి కరోనా
- 2,43,674 మంది మృతి
- అమెరికాలో 11.3 లక్షల మందికి కరోనా
- స్పెయిన్‌లో మొత్తం 2,45,000 కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు 34,24,254 మందికి కరోనా సోకగా, వారిలో 2,43,674 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 11.3 లక్షల మందికి కరోనా సోకగా, వారిలో 66,224 వేల మంది మృతి చెందారు. అమెరికాలో గత 24 గంటల్లో 1,435 మంది కొవిడ్-19తో ప్రాణాలు కోల్పోయారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
స్పెయిన్‌లో మొత్తం 2,45,000 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 2,09,300, యూకేలో 1,82,200, ఫ్రాన్స్‌లో 1,68,300, జర్మనీలో 1,64,967, టర్కీలో 1,24,300, రష్యాలో 1,24,000, రష్యాలో 1,24,000, బ్రెజిల్‌లో 97,000, ఇరాన్‌లో 96,448 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 11,21,000 మంది కోలుకోగా, 2,44,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులు తగ్గుముఖం పట్టిన చైనాలో కొత్తగా 14 కేసులు నమోదై, మొత్తం కేసుల సంఖ్య 82,877 కి చేరింది. ఇప్పటివరకు ఆ దేశంలో 4,630 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 18,806 మందికి కరోనా సోకగా వారిలో 432 మంది మృతి చెందారు.