భారత్‌లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో నమోదైన అత్యధిక మరణాలు, కేసులు!
- గత 24 గంటల్లో 83 మంది మృతి
- అదే సమయంలో 2,644 కేసులు
- కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,301
- కోలుకున్న 10,633 మంది
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో భారత్‌లో ఇప్పటివరకు ఏ రోజూ నమోదు కానంత అధికంగా మృతుల సంఖ్య నమోదయింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,644 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని అత్యధిక కేసులు, మృతుల సంఖ్య నమోదు కాలేదు.
దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,301కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 39,980కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 10,633 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 28,046 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 12,296కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 521 మంది మృతి చెందారు. 2,000 మంది కోలుకున్నారు.
ఆ తరువాత గుజరాత్‌లో అత్యధికంగా 5,054 మందికి కరోనా సోకగా 262 మంది మృతి చెందారు. 896 మంది కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 4,122కి చేరింది. 1,256 మంది కోలుకోగా, 64 మంది మృతి చెందారు.
మధ్యప్రదేశ్‌లో 2,846 కేసులు నమోదు కాగా, 151 మంది ప్రాణాలు కోల్పోయారు. 624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తమిళనాడులో 2,757 మందికి కరోనా సోకగా 1,341 మంది కోలుకున్నారు. 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజస్థాన్‌లో 2,770 మందికి కరోనా సోకగా 1,121 మంది కోలుకున్నారు.. 65 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌లో 2,487 మందికి కరోనా సోకగా వారిలో 689 మంది కోలుకున్నారు.. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 499 మొత్తం మందికి కరోనా సోకింది.