జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు... ఐదుగురు జవాన్ల మృతి

  • కుప్వారా జిల్లాల్లోని హంద్వారాలో ఘటన
  • తనిఖీలు చేపట్టిన జవాన్లపై కాల్పులు
  • ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కుప్వారా జిల్లాల్లోని హంద్వారాలో జవాన్లు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఓ కమాండింగ్‌ ఆఫీసర్, మేజర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హంద్వారాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జవాన్లు తనిఖీలు చేపట్టగా ఉగ్రవాదులు దాడికి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల నేపథ్యంలో హంద్వారాలో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని నిలిపివేశారు. 


More Telugu News