తెలంగాణలో కరోనా బారిన పడిన వారిలో అత్యధికులు యువకులే..
- రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 29
- యాక్టివ్ కేసులు 533
- కొత్త కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలోనే
శనివారం నాడు తెలంగాణలో మరో 17 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1061కు చేరింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులపై హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ, మరో వ్యక్తి మరణించారని పేర్కొంది.
కాగా, తెలంగాణలో కరోనా బారిన పడిన వారిలో అత్యధికులు 21 నుండి 30 సంవత్సరాల లోపు వారుండటం గమనార్హం. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 29కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చికిత్స పొందిన తరువాత 499 మందిని డిశ్చార్జ్ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక శనివారం నమోదైన కేసుల్లో 15 గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగా, 2 రంగారెడ్డి జిల్లాలో వచ్చాయి.
.