యూజర్లు అనుమతించిన దానికంటే ఒక్క ముక్క కూడా అదనపు సమాచారం సేకరించం: షియోమీ
- యూజర్ల నుంచి భారీగా డేటా సేకరిస్తోందంటూ ఆరోపణలు
- ఇన్ కాగ్నిటో మోడ్ లోనూ డేటా సేకరిస్తోందంటున్న సైబర్ నిపుణులు
- యూజర్ల ప్రైవసీకి గౌరవం ఇస్తామని షియోమీ వెల్లడి
భారత్ లో అత్యధికంగా అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ. సరసమైన ధరల్లో, ఆధునిక ఫీచర్లతో ఫోన్లను రూపొందించే షియోమీపై ఓ అపప్రథ ఉంది. ఫోన్ ద్వారా యూజర్ల డేటాను పరిమితికి మించి సేకరిస్తుందని ఈ చైనా దిగ్గజ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై షియోమీ ఇండియా విభాగం స్పందించింది. ఫోన్ లో యూజర్లు అనుమతించిన దానికంటే ఒక్క ముక్క కూడా అదనంగా సమాచారం సేకరించబోమని స్పష్టం చేసింది.
యూజర్ ప్రైవసీని షియోమీ అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుందని, ఎంఐ బ్రౌజర్ కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుందని తెలిపింది. ప్రపంచంలోని అన్ని బ్రౌజర్ల లాగే ఇది కూడా యూజర్ అనుమతించినంత వరకే సమాచారం సేకరిస్తుందని షియోమీ ఓ ప్రకటనలో వివరించింది.
ఇటీవలే సైబర్ నిపుణులు ఈ కంపెనీ ఫోన్లలో ఉపయోగించే ఎంఐ బ్రౌజర్ పై సందేహాలు వ్యక్తం చేశారు. మితిమీరిన స్థాయిలో యూజర్ల డేటా సేకరిస్తోందని పేర్కొన్నారు. ఇన్ కాగ్నిటో మోడ్ లో ఉన్నప్పుడు కూడా యూజర్ సెర్చ్ హిస్టరీని సేకరిస్తోందంటూ వారు ఆరోపించారు.