మద్యం అమ్మకాలకు అనుమతించడం దివాళాకోరుతనం: సీపీఐ నారాయణ

  • మద్యాన్ని ఆర్థిక వనరుగా భావించకూడదు
  • లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు మద్య నిషేధం కొనసాగాలి
  • మందు వల్ల రోగ నిరోధకశక్తి తగ్గుతుంది
లాక్ డౌన్ పాక్షిక సడలింపు పేరుతో మద్యం అమ్మకాలకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇది దివాళాకోరుతనమని చెప్పారు. మద్యాన్ని ఆర్థిక వనరుగా భావించకూడదని చెప్పారు.

లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు మద్యంపై నిషేధం కొనసాగాలని డిమాండ్ చేశారు. మందు తాగడం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గుతుందని డాక్టర్లు కూడా చెపుతున్నారని గుర్తు చేశారు. మందు లేకపోవడం వల్ల తాగుబోతుల కేసులు కూడా తగ్గాయని తెలిపారు. బీహార్ ప్రభుత్వం ఎప్పటి నుంచో మద్యనిషేధాన్ని అమలు చేస్తోందని చెప్పారు.


More Telugu News