ఎవరెస్ట్ శిఖరంపై కూడా 5జీ సిగ్నల్!
- టిబెట్ వైపు నుంచి హిమాలయాల వైపు 5జీ సిగ్నల్
- ప్రాజెక్టు కోసం 1.42 మిలియన్ డాలర్ల వ్యయం
- పర్వతారోహకులకు, కార్మికులకు, పరిశోధకులకు చాలా ఉపయోగం
చైనా మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం చైనా దాదాపు 1.42 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. టిబెట్ చైనా సరిహద్దుల్లో హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్ అందుబాటులో ఉంటుందని చైనా ప్రకటించింది.
ప్రస్తుతం ఎవరెస్ట్ పై 5,800 మీటర్ల వరకు బేస్ క్యాంపులు ఉన్నాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల కొత్త బేస్ క్యాంపును నిర్మించారు. ఈ బేస్ క్యాంపులో 5జీ టవర్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరెస్ట్ పైవరకు 5జీ సిగ్నల్ అందుబాటులోకి వచ్చినట్టైంది. పర్వతారోహకులకు, కార్మికులకు, పరిశోధకులకు ఈ 5జీ నెట్ వర్క్ ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అత్యంత వేగవంతమైన డేటాతో పాటు ఎక్కువ నెట్ వర్క్ సామర్థ్యాన్ని 5జీ కలిగి ఉంటుంది. 5జీతో ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు. అత్యంత క్వాలిటీతో వర్చువల్ మీటింగ్స్ ను నిర్వహించుకోవచ్చు. 5జీ సేవలు అందుబాటులోకి రావడంతో ఎవరెస్ట్ పై కూడా పర్వతారోహకులు ఇంటర్నెట్ ను ఎంజాయ్ చేసే అవకాశం కలిగింది.