ట్రంప్ వ్యాఖ్యలకు డబ్ల్యూహెచ్ఓ కౌంటర్... చైనాపై పొగడ్తలు
- కరోనా వుహాన్ ప్రయోగశాలలోనే పుట్టిందని ట్రంప్ పునరుద్ఘాటన
- వైరస్ సహజసిద్ధంగానే జన్మించిందన్న డబ్ల్యూహెచ్ఓ
- వుహాన్ ను చూసి ప్రతిదేశం నేర్చుకోవాలని సూచన
వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ ఉద్భవించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. కరోనా మహమ్మారి ప్రయోగశాలలో పుట్టిన వైరస్ కాదని, అది సహజసిద్ధంగా వాతావరణంలోనే జన్మించిందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
కరోనా వైరస్ కు ఆవాసంగా నిలుస్తున్న జీవి ఏంటన్నది తెలుసుకునేందుకు పరిశోధనలు సాగుతున్నాయని వివరించింది. కరోనా వైరస్ ఏ జీవి ద్వారా మానవులకు సంక్రమించిందన్నది తెలిస్తే, వ్యాప్తి నివారణకు కీలక ముందడుగు పడినట్టేనని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అంతేగాకుండా, చైనాపై పొగడ్తల జల్లు కురిపించింది. కరోనా వైరస్ ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని, ప్రతి దేశం వుహాన్ ను చూసి నేర్చుకోవాలని, కొద్ది వ్యవధిలోనే వుహాన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది.