అందుకే 'కబీర్ సింగ్' చేయలేదు: విజయ్ దేవరకొండ
- ఆర్ధిక పరమైన సమస్యలు చూశాను
- మా నాన్న వల్లనే సినిమాల్లోకి వచ్చాను
- బాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తానన్న విజయ్ దేవరకొండ
తెలుగులో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన తాజా చిత్రంగా 'ఫైటర్' రూపొందుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
"చదువుకునే రోజుల్లోనే చాలా ఇబ్బందులు పడ్డాను. ఆర్థికపరమైన సమస్యలు ఎలా ఉంటాయనేది చూశాను. కష్టాల కారణంగానే ఏది మంచి .. ఏది చెడు అనేది గ్రహించగలిగాను. మా నాన్న కారణంగానే సినిమాల్లోకి వచ్చాను.
ఇక 'అర్జున్ రెడ్డి'ని హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేస్తూ ముందుగా నన్నే అడిగారు. ఒకసారి చేసిన పాత్రను మరోసారి చేయడం ఇష్టం లేక చేయలేదు. ప్రస్తుతం పూరి - కరణ్ జోహార్ కాంబినేషన్లో చేస్తున్న సినిమా, చిత్రీకరణ పరంగా సగానికి పైగా పూర్తయింది. ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువవుతాననే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.