నిత్యం రైళ్లు నడపండి: కూలీల తరలింపుపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం
- దేశ వ్యాప్తంగా శ్రామిక ప్రత్యేక రైళ్ల సేవలు
- రాష్ట్రాలతో మాట్లాడి నిత్యం శ్రామిక రైళ్లు నడపాలని నిర్ణయం
- డీఎం, డీఆర్‌ఎంలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఇప్పటికే సంప్రదింపులు
- రైళ్లు నడిపే అధికారాన్ని జోనల్ రైల్వే అధికారులకిచ్చిన కేంద్రం
దేశ వ్యాప్తంగా శ్రామిక ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ దిశగా పలు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలతో మాట్లాడి నిత్యం శ్రామిక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
డీఎం, డీఆర్‌ఎంలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు రైళ్ల రాకపోకలు అందుబాటులో ఉండాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించింది. రైళ్లు నడిపే అధికారాన్ని జోనల్ రైల్వే అధికారులకే ఇచ్చినట్లు వెల్లడించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నడపాలో జోనల్ రైల్వేలే ఖరారు చేస్తాయని వెల్లడించింది.
వలస కూలీల తరలింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలను సొంత ప్రాంతాలకు తరలించడానికి ఇప్పటికే అధికారులు రైల్వే స్టేషన్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాజిక దూరం నిబంధనను పాటిస్తూనే కూలీలను తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.