సత్ఫలితాలనిస్తున్న రెమ్‌డెసివిర్ ఔషధం.. అమెరికాలో వినియోగానికి లభించిన అనుమతి!
- మిగతా ఔషధాల కంటే 31 శాతం అధిక ప్రభావం
- అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతి
- ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
యాంటీ కరోనా డ్రగ్ రెమ్‌డెసివిర్ మెరుగైన ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో కోవిడ్ చికిత్సలో దానిని వాడేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ)కి అంగీకరించింది. అమెరికాకు చెందిన ‘గిలీడ్ సైన్సెస్’ తయారుచేస్తున్న ఈ ఔషధాన్ని ఆరోగ్య పరిస్థితి విషమించిన కోవిడ్ రోగులకు మాత్రమే ఇవ్వాలని ఎఫ్‌డీఏ ఈ సందర్భంగా సూచించింది. ‘గిలీడ్ సైన్సెస్’ సీఈవోతో కలిసి అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఎఫ్‌డీఏ నిర్ణయాన్ని ప్రకటించారు.
రెమ్‌డెసివిర్ ఔషధాన్ని తీసుకున్న రోగులు మిగతా ఔషధాలతో పోలిస్తే 31 శాతం వేగంగా అంటే సగటును నాలుగు రోజుల ముందే కోలుకుంటున్నట్టు అధ్యయనంలో తేలినట్టు ఎఫ్‌డీఏ తెలిపింది. ఈ కారణంగానే దాని వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. ఈ డ్రగ్ వినియోగంలో మనుషులకు ఎలాంటి అపాయం ఉండదనడానికి మరిన్ని బలమైన ఆధారాలు సమర్పిస్తే పూర్తిస్థాయి వినియోగానికి అనుమతి ఇస్తామని వివరించింది.