గల్ఫ్ దేశాల నుంచి తబ్లిగీ జమాత్ చీఫ్ ఖాతాలోకి కోట్లాది రూపాయలు!
- ఫాంహౌస్ నుంచి కీలక డాక్యుమెంట్ల స్వాధీనం
- రూ. 2 కోట్లతో ఆస్తుల కొనుగోలు
- దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్‌తోపాటు అతడి సన్నిహితుల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి కోట్లాది రూపాయలు వచ్చి పడినట్టు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా తాము సేకరించిన వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అందించారు.
మౌలానా సాద్, అతడి ముగ్గురు కుమారులు, మేనల్లుడి ఖాతాల్లోకి గల్ఫ్ నుంచి కోట్ల రూపాయలు జమ అయినట్టు సాద్ ఫాంహౌస్‌పై దాడి సందర్భంగా పోలీసులు గుర్తించారు. ఆ నిధులతో రూ. 2 కోట్ల విలువైన ఆస్తులు కొన్న డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ సొమ్ము హవాలా మార్గంలో వచ్చిందా? లేక మనీలాండరింగ్‌కు పాల్పడ్డారా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.