లాక్ డౌన్ ఎత్తివేతకు మనం కొన్నిరోజుల దూరంలోనే ఉన్నాం: ఎస్ బీఐ చైర్మన్

  • లాక్ డౌన్ పై స్పందించిన ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్
  • లాక్ డౌన్ తో అతి పెద్ద బాధ తప్పిందని వెల్లడి
  • కరోనా కేసుల సంఖ్య తగ్గడానికి లాక్ డౌనే కారణమని వ్యాఖ్యలు
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) చైర్మన్ రజనీశ్ కుమార్ లాక్ డౌన్ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని, పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఎత్తివేతకు కొన్నిరోజుల దూరంలోనే ఉన్నామని భావిస్తున్నట్టు తెలిపారు.

అయితే కొన్నిరాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, గ్రీన్ జోన్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ స్వీయనియంత్రణతో వ్యవహరిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గించవచ్చని అన్నారు. లాక్ డౌన్ విధించడం వల్ల దేశానికి అతి పెద్ద బాధ తప్పినట్టయిందని, కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గిందని రజనీశ్ కుమార్ వివరించారు. లాక్ డౌన్ తో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం ఏర్పడినా, దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్న డిమాండ్ తగ్గకుండా కాపాడుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.


More Telugu News