మేం ప్రజల్లో ఉన్నాం.. ప్రజల మధ్యలో ఉన్నాం: హరీశ్ రావు

  • రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తున్నాం
  • దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ పని చేయడం లేదు
  • రైతులపై విపక్ష నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మంత్రి హరీశ్ రావు అన్నారు. లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల నుంచి తమ ప్రభుత్వం పంటను కొంటోందని... దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంటను కొనుగోలు చేయడం లేదని చెప్పారు.

 రైతుల పక్షాన ప్రభుత్వం పని చేస్తుంటే... విపక్ష నేతలు ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఐసొలేషన్ లో ఉన్నాయని చెప్పారు. తాము ప్రజల్లో ఉన్నామని, ప్రజల మధ్యలో ఉన్నామని.. విపక్షాలు హైదరాబాదులో, గాంధీభవన్ లో ఉన్నాయని దుయ్యబట్టారు. మెదక్ జిల్లా కుల్చారం మండలం రంగంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతుల మీద ప్రతిపక్ష నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని హరీశ్ విమర్శించారు. విపక్ష నేతలు ఆరోపిస్తున్నట్టు గన్నీ బ్యాగులు, లారీల సమస్య లేదని చెప్పారు. కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అధికారులు, ఐకేపీ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు.


More Telugu News