స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థులు, వలస కార్మికులకు అనుమతి ఇచ్చాం: కేంద్రం

  • లాక్ డౌన్ తో నిలిచిపోయిన విద్యార్థులు, వలస కార్మికులు
  • నిత్యావసరాలకు కొరత లేదన్న కేంద్రం
  • ట్రక్కులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశం
కేంద్రం పొడిగించిన లాక్ డౌన్ ఎల్లుండితో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యార్థులు, వలస కార్మికులు, కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. దేశంలో నిత్యావసర వస్తువులకు కొరతలేదని, 62 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రాలు సేకరించాయని తెలిపారు. ట్రక్కుల రవాణాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామని అన్నారు. సరుకు రవాణాకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని స్పష్టం చేశారు.


More Telugu News