నటుడ్ని కాకపోయుంటే ఆర్కిటెక్ట్ అయ్యేవాడ్ని: విజయ్ దేవరకొండ

  • ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
  • ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టమని వెల్లడి
  • జపాన్ లో ఆర్కిటెక్చర్ బాగుంటుందని వ్యాఖ్యలు
టాలీవుడ్ లో కొద్దికాలంలోనే తారాపథానికి ఎగిసిన యువ హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు ఆర్కిటెక్చర్ రంగం అంటే చాలా ఇష్టం అని, తాను ఎప్పుడు ప్రయాణాలు చేసినా అక్కడి భవంతుల నిర్మాణ శైలి పట్ల ఆకర్షితుడ్నవుతుంటానని, ప్రపంచస్థాయి ఆర్కిటెక్చర్ కు సంబంధించి ఎన్నో వీడియోలు చూస్తుంటానని వివరించారు. ఆర్కిటెక్చర్ కోసం ఏ దేశం అయినా వెళ్లాలని భావిస్తే అది జపాన్ మాత్రమేనని తెలిపారు. ఒకవేళ తాను సినీ నటుడ్ని కాకపోయుంటే ఆర్కిటెక్ట్ అయ్యేవాడ్నని స్పష్టం చేశారు.


More Telugu News