గేల్ వ్యాఖ్యలపై స్పందించిన రామ్ నరేశ్ శర్వాన్

  • శర్వాన్ ను పాముతో పోల్చిన గేల్
  • తల్లావాస్ జట్టు నుంచి ఉద్వాసనకు శర్వానే కారణమంటూ ఆరోపణలు
  • గేల్ తనకు సన్నిహితుడున్న శర్వాన్
  • ఆరోపణలు చేయడం దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడి
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ లో జమైకా తల్లావాస్ జట్టు నుంచి తనను తొలగించడానికి కారణం రామ్ నరేశ్ శర్వాన్ అంటూ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ ఆరోపించడం తెలిసిందే. శర్వాన్ పాము లాంటి వాడని, కరోనా వైరస్ కంటే ప్రమాదకారి అని పేర్కొన్నాడు. దీనిపై శర్వాన్ స్పందించాడు. గేల్ వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. తనకెంతో సన్నిహితుడని భావించిన గేల్ ఇలాంటి ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపాడు. తనతో పాటు అనేకమంది ప్రతిష్ఠకు భంగం కలిగేలా గేల్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నాడు.

"కెరీర్ మొదట్నించి గేల్ తో కలిసి ఆడాను. అతడిలో అసాధారణ ప్రతిభ ఉంది. అతడ్ని జట్టు నుంచి తొలగించాలని నేనెందుకు కోరుకుంటాను?" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అటు, జమైకా తల్లావాస్ జట్టు యాజమాన్యం కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. గేల్ ను జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసేశామని, అంతే తప్ప అందులో శర్వాన్ ప్రమేయం ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది.


More Telugu News