హాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్ .. కాలు తొలగింపు!
- నటుడు నిక్ కార్డెరోకు కరోనా పాజిటివ్
- కరోనా కారణంగా తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురైన నిక్
- ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరకుండా కాలు తొలగింపు
కరోనా దెబ్బకు హాలీవుడ్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే అన్ని కార్యకలాపాలు ఆగిపోయిన హాలీవుడ్ మూగబోయింది. మరోవైపు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు దీని బారిన పడుతున్నారు. కొందరు మృత్యువాత పడ్డారు కూడా. తాజాగా కరోనా సోకిన హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో... చివరకు తన కాలును కోల్పోవాల్సి వచ్చింది.
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నిక్... లాస్ ఏంజెలెస్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా కారణంగా అతను తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. దీంతో అతని కుడి కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి, ముక్కలుగా విడిపోయింది. ఇది ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశం ఉంది. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో అతని కాలును వైద్యులు తొలగించారు.