టెస్టుల్లో తొలి స్థానంలోకి వచ్చిన ఆస్ట్రేలియా.. మూడో స్థానంలోకి భారత్
- నిన్నటి వరకు 116 పాయింట్లతో తొలి స్థానంలో భారత్
- రెండో స్థానంలో నిలబడ్డ న్యూజిలాండ్
- వన్డేల్లో రెండో స్థానంలో ఇండియా
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. తాజా ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా టాప్ పొజిషన్ కు చేరుకుంది. రెండో స్థానంలో న్యూజిలాండ్ నిలబడింది. భారత్ తొలి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 116, న్యూజిలాండ్ 115, ఇండియా 114 పాయింట్లతో ఉన్నాయి.
2016 నుంచి టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2016-17లో భారత్ 12 టెస్టులు గెలుపొంది, ఒక టెస్టును కోల్పోయింది. అయితే ఆ రికార్డులను తొలగిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్ కోసం 2019 మే నుంచి ఆడిన మ్యాచులు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచులకు సంబంధించి 50 శాతం రేటింగ్ పాయింట్లను ఆధారంగా తీసుకున్నారు. దీంతో, భారత్ అగ్ర స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. కరోనా కారణంగా మ్యాచులు జరగకపోవడం కూడా భారత్ కు ప్రతికూలంగా మారింది.
మరోవైపు, టీ20ల్లో కూడా భారత్ మూడో స్థానంలో ఉంది. ఆసీస్ తొలి స్థానంలో ఉంది. వన్డేల్లో ఇంగ్లాండ్ తొలి స్థానంలో ఉండగా... భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.