తన స్కూటీని వదిలిపెట్టాలని పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న యువతి!
- కర్ణాటకలోని బనశంకరి ప్రాంతంలో ఘటన
- సడలింపు సమయం ముగిసిన తరువాత వచ్చిన యువతి
- జాలిపడి వదిలేసిన పోలీసులు
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్న వేళ, నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన ఓ యువతిని పోలీసులు అడ్డుకోగా, ఆమె విలపిస్తూ పోలీసుల కాళ్లపై పడింది. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరి పరిధిలోని శిర్కి సర్కిల్ వద్ద జరిగింది.
వివరాల్లోకి వెళితే, ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ఇచ్చిన సమయం ముగిసిన తరువాత, సదరు యువతి బయటకు వచ్చింది. తన స్కూటీపై వెళుతున్న ఆమెను పోలీసులు నిలువరించారు. సమయం అయిపోయిన తరువాత ఎందుకు వచ్చారని మందలిస్తూ, స్కూటీ తాళాలు లాగేసుకున్నారు.
దీంతో బోరున విలపించిన ఆమె, తన స్కూటీని వదిలేయాలంటూ, పోలీసుల కాళ్ల మీదపడి ప్రాధేయపడింది. దీంతో ఆమెపై జాలి చూపిన పోలీసులు, వాహనాన్ని సీజ్ చేయకుండా, మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి, వదిలేశారు. లాక్ డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆమెకు క్లాస్ పీకారు.