నాందేడ్ నుంచి వచ్చిన వారిలో 76 మందికి కరోనా: పంజాబ్ మంత్రి
- హుజూర్ సాహిబ్ సందర్శనకు అమృత్‌సర్ భక్తులు
- లాక్‌డౌన్ వల్ల చిక్కుకుపోయిన వైనం
- తాజాగా అమృత్‌సర్ చేరిన 300 మంది భక్తులు
నాందేడ్‌లోని హుజూర్ సాహిబ్‌ను దర్శించుకుని అమృత్‌సర్ తిరిగి వచ్చిన వారిలో 76 మందికి కరోనా వైరస్ సోకినట్టు పంజాబ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మంత్రి ఓం ప్రకాశ్ సోనీ తెలిపారు. నాందేడ్‌లోని గోదావరి నది ఒడ్డున ఉన్న హుజూర్ సాహిబ్ సిక్కు మతంలోని ఐదు తఖ్త్‌లలో ఒకటి. సిక్కులు పెద్ద సంఖ్యలో దీనిని దర్శించుకుంటారు.
లాక్‌డౌన్‌కు ముందు హుజూర్ సాహిబ్‌ను సందర్శించుకునేందుకు అమృత్‌సర్ నుంచి వచ్చిన భక్తులు ఆ తర్వాత ఇక్కడ చిక్కుకుపోయారు. వీరిలో 300 మంది తాజాగా అమృత్‌సర్‌కు చేరుకున్నారు. అనంతరం వీరందరినీ పరీక్షించగా 76 మందికి కరోనా సోకినట్టు తేలింది. పాజిటివ్‌గా తేలిన అందరినీ ఆసుపత్రులకు తరలించామని మంత్రి తెలిపారు. అలాగే, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్ చేసినట్టు వివరించారు.