లాక్ డౌన్ ముగియడానికి ముందే సీజ్ చేసిన వాహనాలు ఇచ్చేస్తున్న కర్ణాటక పోలీసులు!
- మార్చిలో ప్రారంభమైన లాక్ డౌన్
- అప్పటి నుంచి ఉల్లంఘనుల వాహనాలు సీజ్
- వెనక్కు ఇచ్చేయాలని కర్ణాటక సర్కారు నిర్ణయం
మార్చి నెలలో లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి నిబంధనల ఉల్లంఘనదారులకు సంబంధించిన వాహనాలను సీజ్ చేస్తూ వచ్చిన కర్ణాటక పోలీసులు, వాటిని నేటి నుంచి తిరిగి వెనక్కు ఇచ్చేస్తున్నామన్న శుభవార్తను తెలిపారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన బెంగళూరు సీపీ భాస్కర్ రావు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించాలని నిర్ణయించామన్నారు.
ఇప్పటివరకూ 47 వేలకు పైగా వాహనాలు తమ అధీనంలో ఉన్నాయని, వాటి రికార్డులను పరిశీలించి వెనక్కు ఇస్తామని తెలిపారు. కాగా, లాక్ డౌన్ ముగిసేంత వరకూ సీజ్ కాబడిన వాహనాలను వెనక్కు ఇవ్వబోమని గతంలో పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిని కోర్టు ద్వారానే విడిపించుకోవాల్సి వుంటుందని కూడా పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు గురికాగా, వారికి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం శుభవార్తను వినిపించినట్లయింది.