గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు కుటుంబాల్లో 13 మందికి కరోనా
- చర్లపల్లి పరిధిలో ఓ వ్యాపారి కుటుంబంలో ఆరుగురికి సోకిన మహమ్మారి
- సరూర్‌నగర్‌లోని మరో కుటుంబం మొత్తానికి పాజిటివ్
- స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యాపారి సోదరుడు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు కుటుంబాల్లో 13 మందికి కరోనా వైరస్ సోకింది. చర్లపల్లి డివిజన్ పరిధిలో ఓ హోల్‌సేల్ వ్యాపారి (65)కి మూడు రోజుల క్రితం కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. నిన్న ఆయన సోదరుడు (45), అతడి పెద్ద కోడలు (32), చిన్న కుమారుడు, ఇద్దరు మనవళ్లకు కరోనా సోకినట్టు తేలింది.
అలాగే సరూర్‌నగర్‌లోని శారదానగర్‌కు చెందిన మరో వ్యాపారి (50), ఆయన తండ్రి, తల్లితోపాటు వనస్థలిపురంలో ఉండే అతడి సోదరుడు (40), సోదరుడి భార్య (35), వారి ఇద్దరి కుమార్తెలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాదు, 76 ఏళ్ల వీరి తండ్రి నిన్న మృతి చెందండంతో స్థానికులు భయంతో వణుకుతున్నారు. ఆ వ్యాపారి సోదరుడు స్థానికంగా కిరాణ దుకాణం నిర్వహిస్తుండడంతో అతడి నుంచి మరెంతమందికి ఈ మహమ్మారి సోకి వుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.