కరోనా బారినపడిన రష్యా ప్రధాని.. సెల్ఫ్ ఐసోలేషన్!
- దేశ ప్రధానులనూ వదలని వైరస్
- ఇటీవలే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోకిన మహమ్మారి
- అందుబాటులోనే ఉంటానన్న మిఖాయిల్
కరోనా మహమ్మారి దేశ ప్రధానులను కూడా విడిచిపెట్టడం లేదు. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను పట్టిపీడించిన ఈ వైరస్, తాజాగా రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ (54)ను పట్టుకుంది. తనకు కరోనా సోకిందన్న విషయం నిర్ధారణ అయిన వెంటనే మిఖాయిల్ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లారు.
అయితే, కీలక అంశాల విషయంలో అందుబాటులో ఉంటానని అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఆర్థిక పరమైన బాధ్యతలను పర్యవేక్షించే మిషుస్టిన్ తరచూ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవుతుంటారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ చివరిసారి ఎప్పుడు భేటీ అయ్యారనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.