ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన చైనా
- ఎన్నికల్లో తన ఓటమికి చైనా ప్రయత్నిస్తోందన్న ట్రంప్
- తమకు అంత ఆసక్తి లేదన్న చైనా
- అమెరికా ఎన్నికల రాజకీయాల్లోకి తమను లాగవద్దని హితవు
చైనా అధినాయకత్వానికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో తన ఓటమికి చైనా కుయుక్తులు పన్నుతోందని, తన ప్రత్యర్థులకు సహకరిస్తోందని ట్రంప్ తీవ్ర ఆరోపణలు గుప్పించడం తెలిసిందే.
తాజాగా ట్రంప్ వ్యాఖ్యలను చైనా ఖండించింది. తమకు అంత ఆసక్తి లేదని స్పష్టం చేసింది. ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం అని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమ ప్రాధాన్యతాంశం కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల రాజకీయాల్లోకి తమను లాగడం ఎందుకని ప్రశ్నించారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విఫలమై, ఆ అసహనాన్ని చైనాపై ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ట్రంప్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.