ఫ్లాట్ లో కుళ్లిపోయిన స్థితిలో ముంబయి ఎయిర్ హోస్టెస్ మృతదేహం
- ఇద్దరు కొలీగ్స్ తో కలిసి ఉంటున్న ఎయిర్ హోస్టెస్
- లాక్ డౌన్ కు ముందే వెళ్లిపోయిన సహోద్యోగులు
- ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన
- పోలీసులకు సమాచారం అందించిన పొరుగువాళ్లు
ముంబయిలో ఓ ఎయిర్ హోస్టెస్ తన ఫ్లాట్ లో కుళ్లిపోయిన స్థితిలో శవమై పడివుండగా గుర్తించారు. సుల్తానా షేక్ (29) అనే ఎయిర్ హోస్టెస్ నగరంలోని పోద్దార్ వాడి ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. సుల్తానా 'గో ఎయిర్' విమానయాన సంస్థలో పనిచేస్తోంది. ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఫ్లాట్ లో ఉంటోంది. ఆమె సహోద్యోగులిద్దరూ లాక్ డౌన్ కు ముందే ముంబయి నుంచి వెళ్లిపోయారు. దాంతో సుల్తానా షేక్ ఒక్కతే ఉంటోంది.
అయితే కొన్నిరోజులుగా ఆమె ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా సుల్తానా షేక్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఏమీ కనిపించకపోవడంతో, ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.