మయన్మార్ దేశాధినేత ఆంగ్ సాన్ సూకీతో మాట్లాడిన ప్రధాని మోదీ

  • కరోనాతో విలవిల్లాడుతున్న అనేక దేశాలు
  • దేశాధినేతలకు మోదీ స్నేహ హస్తం
  • మయన్మార్ తో కలిసి కరోనా నివారణకు కృషి చేస్తామని వెల్లడి
కరోనా రక్కసి ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేక దేశాలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. సహాయ సామగ్రి, ఔషధాలు పంపిస్తూ ఔదార్యం ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా అనేక దేశాధినేతలతో ఫోన్ లో మాట్లాడుతూ వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నారు. తాజాగా మయన్మార్ దేశాధినేత ఆంగ్ సాన్ సూకీతో మాట్లాడారు. దీనిపై ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు.

ఇరుదేశాల్లో కరోనా వైరస్ భూతం విజృంభిస్తున్న తీరుతెన్నుల పట్ల చర్చించామని తెలిపారు. కరోనా వ్యాప్తి క్రమంలో ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కొనే అంశంలో ఐక్యంగా కృషి చేయాలని నిర్ణయించామని వివరించారు.  పొరుగుదేశానికి ప్రథమ ప్రాధాన్యత అనే భారత సిద్ధాంతాన్ని మయన్మార్ విషయంలోనూ వర్తింపజేస్తామని, ఇరుదేశాల మధ్య ఉన్న అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతామని మోదీ పేర్కొన్నారు.


More Telugu News