కరోనా కాలంలో కార్మికులపై సానుభూతి చూపాల్సిన అవసరం ఉంది: పవన్ కల్యాణ్

  • కార్మికులకు జనసేనాని మే డే శుభాకాంక్షలు
  • ఏ దేశానికైనా కార్మికులే ఇంధనం అని వెల్లడి
  • కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి
జనసేనాని పవన్ కల్యాణ్ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా కష్టకాలంలో కార్మికులపై సానుభూతి చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏ దేశ ఆర్థిక రంగ పురోగతికైనా శ్రమజీవుల కష్టించే తత్వమే ప్రధాన ఇంధనం అని స్పష్టం చేశారు.

మే డే సందర్భంగా కార్మిక లోకం శ్రమను మరోసారి గుర్తించాలని పిలుపునిచ్చారు. కరోనా పరిస్థితుల దుష్ప్రభావం కార్మికులపై పడే అవకాశం ఉందని, వారి ఉపాధికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని కోరారు. అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమం గురించి కూడా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.


More Telugu News