‘పోలవరం’ ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు నిధులు మంజూరు
- ‘పోలవరం’ పనులు వేగవంతం చేసే నిమిత్తం నిర్ణయం
- దేవీపట్నంలోని ఆరు గ్రామాలకు నిధులు మంజూరు
- రూ.79 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
పోలవరం ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో ముంపు గ్రామాల పరిధిలోని దేవీపట్నం ప్రాంతంలో ఉన్న ఆరు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ కింద రూ.79 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే నిమిత్తం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ నిన్న సమీక్షించారు. గత ఏడాది సంభవించిన గోదావరి వరదల్లో ముంపునకు గురైన కుటుంబాలను తక్షణం తరలించాలని, వారికి పునరావాసం కల్పించే చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.