కనికా కపూర్‌ను ప్రశ్నించిన లక్నో పోలీసులు
- విదేశాల నుంచి వచ్చాక లక్నోలో పాల్గొన్న పార్టీలపై ఆరా
- ఆమె వాంగ్మూలం రికార్డు
- కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ గాయని
కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ గాయని కనికా కపూర్ ను లక్నో పోలీసులు విచారించారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత లక్నోలో ఆమె పాల్గొన్న పార్టీల గురించి విచారించారు. వీటిపై ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. గత నెల 20న కనికాకు కరోనా సోకినట్టు తేలింది. అప్పటికే ఆమె మూడు పార్టీలకు హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత స్వీయ నిర్బంధం ఉల్లంఘించారని ఆమెపై కేసు నమోదు చేశారు.
కనిక హాజరైన ఓ పార్టీలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుశ్యంత్ సింగ్ సహా పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలపై కనికాను విచారించినట్టు లక్నో సరోజినీ నగర్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ సాహి తెలిపారు. గాయని పాస్‌పోర్టు కాపీలు, విమాన టికెట్లు, ఇతర డాక్యుమెంట్లను సేకరించినట్టు చెప్పారు.