షోయబ్ అఖ్తర్ పై పరువునష్టం దావా వేసిన సొంత క్రికెట్ బోర్డు

  • ఉమర్ అక్మల్ పై మూడేళ్ల నిషేధం
  • పీసీపీ లీగ్ డిపార్ట్ మెంట్ అసమర్థత అని విమర్శించిన అఖ్తర్
  • తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పీసీబీ
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు పరువునష్టం దావా వేసింది. పీసీబీ లీగల్ అడ్వైజర్ అఫాజ్జుల్ రిజ్వి ఈ దావా వేశారు. దీంతో పాటు క్రిమినల్ కేసును కూడా ఫైల్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, అవినీతి ఆరోపణలతో పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పై మూడేళ్ల నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో పీసీబీ లీగల్ డిపార్ట్ మెంట్ పై అఖ్తర్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. లీగల్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టాడు. అంతేకాదు, పీసీపీ నిర్ణయాన్ని ఎండగడుతూ ఒక వీడియోను విడుదల చేశాడు.

పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థత వల్లే ఉమర్ కు మూడేళ్ల శిక్ష పడిందని అఖ్తర్ విమర్శించాడు. సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదని అన్నాడు. దీంతో, రిజ్వి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. అఖ్తర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని మండిపడ్డారు. పీసీబీ సైతం అఖ్తర్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది.


More Telugu News