అనిల్ రావిపూడి స్పీడు మామూలుగా లేదు
- వరుస విజయాలతో అనిల్ రావిపూడి
- 'ఎఫ్ 3' సీక్వెల్ కి సన్నాహాలు
- చేతిలో మరో నాలుగు కథలు
కథాకథనాలను చకచకా సిద్ధం చేసుకోవడంలోను .. ప్రేక్షకులను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడంలోను .. అంతే వేగంగా ఆ కథలను తెరకెక్కించడంలోను అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. అందువల్లనే ఆయన సినిమాలు చకచకా ముస్తాబై థియేటర్స్ కి వస్తుంటాయి. వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అపజయమెరుగని దర్శకుడిగా ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
మహేశ్ వంటి స్టార్ హీరో సినిమానే ఆయన 6 నెలలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఒక కథను రాస్తూ ఉండగా మరో ఆలోచన వస్తే, వెంటనే మరో పేపర్ పై పెట్టేస్తూ ఒకే సమయంలో రెండు మూడు కథలను రెడీ చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. అలా ఆయన తయారు చేసిన కథలు 4 సిద్ధంగా వున్నాయట. ఒకదాని తరువాత ఒకటిగా ఆ సినిమాలను ఆయన సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక డైలాగ్స్ ను వేగంగా రాయడంలోను అనిల్ రావిపూడి తన సత్తా చాటుకున్నాడు. ఇలా ఏ రకంగా చూసినా, చాలా తక్కువ సమయంలో ప్రేక్షకుల ముందుకు సినిమాలను తీసుకొచ్చే అతికొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.